12 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌

by Naga Rani Yarlagadda |

ఇజ్రాయెల్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 12 రోజులుగా గగనతలాన్ని మూసివేసిన ఇరాన్.. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఆ ఆంక్షలు ఎత్తివేసింది.

12 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 12 రోజులుగా గగనతలాన్ని మూసివేసిన ఇరాన్.. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఆ ఆంక్షలు ఎత్తివేసింది. ఇరాన్ గగన తలాన్ని తెరవడంతో.. ఇరాన్ మీదుగా దుబాయ్ నుంచి రష్యాకు తొలి విమానం వెళ్లింది. అలాగే ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం పూర్తిగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా.. ఇరాన్ - ఇజ్రాయెల్ ల మధ్య ట్రంప్ శాంతి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సీజ్ ఫైర్ పై ఆయన ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఇరు దేశాలు ఆ ప్రతిపాదనను ఉల్లంఘించాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ 6 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఐదుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై ట్రంప్ సీరియస్ అవ్వడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి.

Next Story