- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్‌లోని ‘లిటిల్ ఇండియా’పై ఇరాన్ క్షిపణుల దాడి.. 30 మందికి గాయాలు
ఇజ్రాయెల్‌లోని 'లిటిల్ ఇండియా' డియోనాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 30 మంది గాయపడటంతో తీవ్ర కలకలం రేగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తత మంటలు చల్లారడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు చేస్తుంటే ఇరాన్ (Iran) అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. దీంతో యుద్ధం మొదలై రెండు వారాలు దాటినా ఎక్కడా ఆగుతుంతో అంతుచిక్కడం లేదు. తాజాగా ఇరాన్‍లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడికి ప్రతికారంగాఇజ్రాయెల్‍పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన వారు అత్యధికంగా ఉంటే లిటిల్ ఇండియాగా (Little India) పిలువబడే డియోనా నగరాన్ని ఇరాన్ క్షిపణులు తాకడం కలకలం రేపుతుంది. ఈ దాడుల్లో 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
మరాఠీలే ఎక్కువ:
టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సమాచారం ప్రకారం డియోనా నగరంలో భారత సంతతి ప్రజలు అధికంగా ఉన్నారు. 1950 - 1960ల కాలంలో భారత్‌లోని యూదు కమ్యూనిటీకి చెందిన అనేక కుటుంబాలు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లాయి. వీరిలో అత్యధికులు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, కేరళ, కోల్‌కతా నుంచి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఈ నగర ప్రస్తుతం జనాభాలో దాదాపు 30 శాతం మంది భారత సంతతి వారే. ప్రస్తుతం ఇక్కడ సుమారు 7,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇటీవల మిజోరం, మణిపూర్ ప్రాంతాల నుంచి కూడా కొందరు ఇక్కడికి వలస వెళ్లారు. ఇక్కడ వీరంరిలో చాలా మంది మరాఠీ అనర్గళంగా మాట్లాడతుంటారు. అక్కడక్కడా హిందీ మాటలు కూడా వినిపిస్తుంటాయి. స్థానిక దుకాణాల్లో సోన్‌పాప్‌డి, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్‌పురి వంటి భారతీయ వంటకాలు విరివిగా లభిస్తుంటాయి. అయితే ఇక్కడి భారతీయుల్లో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులుగా, ఐటీ నిపుణులుగా రాణిస్తున్నారు. 2025లో ఇక్కడ నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభించింది.






