- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గగనతలం మూసివేసిన యూఏఈ.. ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ అడ్వైజరీ
ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. ఈ క్రమంలో ఖతర్, బహ్రెయిన్ గగనతలాలను మూసివేసినట్లు ప్రకటించాయి. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోని సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లి మధ్యప్రాచ్యంలో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఖతార్లోని అల్ ఉదీద్ లోని అమెరికా వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి ప్రకటించింది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ ఎయిర్ వేస్ తమ దేశం నుంచి బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించిది. ఇండిగో ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరడం లేదా దారి మళ్లించనున్నట్లు తెలిపింది. సురక్షితమైన ప్రయాణం కోసం కొన్ని సర్దుబాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. ఇరాన్ దాడుల నేపథ్యంల విమానం ప్రభావితమైతే ప్రత్యామ్నాయ ప్రయాణాల కోసం వెబ్ సైట్ ను తనిఖీ చేయాలని సూచించింది.






