- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: అమెరికా అండతోనే ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ సంచలన ఆరోపణ
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని ఆరోపించారు. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ దాడులు జరిగేవి కాదని తెలిపారు. ఆదివారం ఆయన టెహ్రాన్‌లో మీడియాతో మాట్లాడారు. యూఎస్ ఆయుధాలు లేకుండా ఇజ్రాయెల్ ఈ సాహసానికి ఒడిగట్టేది కాదని స్పష్టం చేశారు.
ఈ దాడుల గురించి తనకు తెలుసని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బహిరంగంగా ధ్రువీకరించారని, కాబట్టి ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికానే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడులతో సంబంధం లేకుంటే అమెరికా తక్షణమే దీనిని ఖండించాలన్నారు. లేదంటే వారి ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలకు ఇజ్రాయెల్ హాని కలిగిస్తోందన్నారు. కాగా, ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు.






