కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడి.. భారతీయ పౌరుడు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-03 11:22:20  IST  )

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు.

కువైట్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడి.. భారతీయ పౌరుడు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్ తమ వైమానిక రంగాన్ని మూసివేయడంతో, భారతీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కువైట్‌కు నడిచే అన్ని సర్వీసులను జూన్ 4 వరకు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

టెర్మినల్-1పై అటాక్.. విమానాలు రద్దు

శత్రు దేశానికి చెందిన డ్రోన్లు విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్-1 (T1) భవనాన్ని నేరుగా ఢీకొట్టడంతో మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ అటాక్‌లో ఓ భారతీయ పౌరుడు మృతి చెందాడు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా కువైట్ అధికారులు వాణిజ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండిగోతో పాటు కువైట్ ఎయిర్‌వేస్, జజీరా ఎయిర్‌వేస్ కూడా తమ విమానాలను రద్దు చేసుకుని ఇతర ప్రాంతాలకు మళ్లించాయి. దాడిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) స్పందిస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ఒమన్ తీరానికి సమీపంలో తమ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడికి ప్రతికారంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా ప్రమాదంలో పడటంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

Next Story