- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ ప్రతీకార దాడులు.. ఒకేసారి ఎనిమిది దేశాలపై ఇరాన్ ఎటాక్
తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. అంతేకాదు.. ఒకేసారి ఏకంగా ఎనిమిది దేశాలపై ఇరాన్ ఎటాక్ చేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతోపాటు అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈపై ఇరాన్ దాడి చేసింది. మిస్సైళ్లతో విరుచుకు పడింది. ఇరాన్ దాడులతో టెల్ అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది. ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఎయిర్‌స్పేస్ కూడా క్లోజ్ చేశారు. మరోవైపు.. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి ప్రతిదాడి అదే స్థాయింలో సమాధానం చెబుతామని హెచ్చరించింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించి ఉండవచ్చు.. కానీ దీని ముగింపు మాత్రం మా చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ సైన్యం అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది.






