బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. ఏకంగా 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో పంజా

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-06 12:00:23  IST  )

బహ్రెయిన్‌లోని సిత్రా ద్వీపంలో ఉన్న బాప్కో (Bapco) ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడి వల్ల రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి.

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. ఏకంగా 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో పంజా
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ రీజియన్‌లో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌ (Bahrain)లోని సిత్రా (Sitra) ద్వీపంలో ఉన్న ‘బాప్కో’(Bapco) ఆయిల్ రిఫైనరీపై 75 మిస్సైళ్లు, 123 డ్రోన్లతో ఇరాన్ (Iran) విరుచుకుపడింది. దీంతో ఆ రిఫైనరీలో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని, పెద్దగా ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సైనిక చర్యలకు ప్రతికారంగా ఇరాన్ పొరుగు దేశాల్లోని చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. తాజాగా దాడి వల్ల బాప్కో రిఫైనరీ కార్యకలాపాలకు కొంత అంతరాయంతో పాటు ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

అమెరికాపై ఇరాన్ యుద్ధ ప్రభావం.. రోజుకు రూ.7,395 కోట్ల ఖర్చు

Next Story