- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహ్రెయిన్‌పై ఇరాన్ ఎటాక్.. అమెజాన్ డేటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు
ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ, బహ్రెయిన్‌లలోని అమెజాన్ (AWS) డేటా సెంటర్లలో భారీగా కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లు తీవ్రమైన కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీస్ జోన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డేటా సెంటర్లపై మిస్సైల్స్ పడి మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లిందని అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక బహ్రెయిన్‌లోని డేటా సెంటర్లలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే, అందుకు గల ఖచ్చితమైన కారణాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎర్రర్ రేట్లు ఎక్కువగా ఉన్నందున, ప్రత్యామ్నాయ ప్రాంతాల (Regions) ద్వారా సేవలను పొందాలని అమెజాన్ తన వినియోగదారులకు సూచించింది.
కాగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, నివాస ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్ డేటా సెంటర్లు కూడా ధ్వంజమైనట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల్లోని అనేక డిజిటల్ సేవలు, వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు.






