- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttar Pradesh:ఆ మొబైల్ నెంబర్ల పై దర్యాప్తు.. కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం?
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayagaraj)లో మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలహలంగా జరుగుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayagaraj)లో మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలహలంగా జరుగుతుంది. ఈ మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు(Devotees) భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల(జనవరి) 29న మహాకుంభమేళా లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 30 మంది మృతి చెందగా 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా? అనే దిశలో యూపీ సర్కార్ దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే కుంభమేళా తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చురుకుగా ఉన్న 16 వేలకు పైగా ఫోన్ నెంబర్ల(Mobile Number) డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ(CCTV) ఫుటేజీని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఘటన పై దర్యాప్తు కోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కకమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఘటన జరిగినప్పటి నుంచి చాలా మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్(Switch Off) చేయబడినట్లు కనుగొన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీటీవీ నుంచి ఫేస్ రికగ్నిషన్ యాప్(Face recognition app) ద్వారా అనుమానితులను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన తర్వాత యూపీ సర్కార్(UP Government) రద్దీ నిర్వహణ, భక్తుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రేపు(ఫిబ్రవరి 3) వసంత పంచమి సందర్భంగా జరుగనున్న అమృత స్నానం విషయంలో పోలీసులు(Police) ఈ రాత్రి నుంచే అప్రమత్తంగా ఉండి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు.






