- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదంపై డీజీసీఏ(DGCA) దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదంపై డీజీసీఏ(DGCA) దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. ఏఏఐబీ డీజీ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రమాద స్థలినికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్ పౌరులు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదంలో మాజీ సీఎం సహా అందరూ మృతిచెందారని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఒకవైపు సహాయక చర్యలు, మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్నాయి.






