ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వెల్లివిరిసిన మతసామరస్యం

by Ajay Maddhiboyina |

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు.

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వెల్లివిరిసిన మతసామరస్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ను పోలీసులు బలవంతంగా దీక్ష విరమించేలా చేయగా ఆయన స్థానంలో కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది.

ఎండలో ఓ ముస్లిం వ్యక్తి కూర్చుని నమాజ్ చేస్తుండగా పక్కనే ఉన్న బౌద్ధ బిక్షువు విసనకర్రతో ఆయనకు గాలి విసురుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని అక్క‌డ కూర్చున్న‌వాళ్లు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. వీడియోలోని వ్య‌క్తుల‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌తాలు వేరైనా మాన‌వ‌త్వ‌మే గొప్ప‌ది అని భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ఇది మంచి ఉదాహ‌ర‌ణ అని కామెంట్లు చేస్తున్నారు. వీడియోను షేర్ చేస్తూ అంతా ఇలా ఉంటే ఎలాంటి గొడ‌వ‌లు ఉండ‌వ‌ని అంటున్నారు.

Next Story