- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌లో బ్లాక్ అవుట్.. ఇంటర్నెట్ బంద్
ఇరాన్‌లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, డాలర్ విలువ గరిష్ఠానికి చేరడం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి కారణాల చేత గత 12 రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్లాక్ అవుట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 8న సాయంత్రం 8:30 గంటల నుంచి ఇరాన్ అంతటా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక్కసారిగా కట్ అయింది. NetBlocks, Cloudflare Radar వంటి ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థల ప్రకారం.. ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
టెహ్రాన్, మష్హద్, షిరాజ్, కెర్మన్‌షా వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో కూడా 2022 మహ్సా అమిని నిరసనలు, 2025లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇలాగే ఇంటర్నెట్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రజలు సమాచారం పంచుకోకుండా, నిరసనలను సమన్వయం చేయకుండా అడ్డుకోవడమే ఈ బ్లాక్‌అవుట్ వెనుక ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇంటర్నెట్ బంద్ కారణంగా ఇరాన్ ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






