- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రపంచ పటంలో లేకుండా పోయేది’.. పాకిస్తాన్ పై స్వామి రాంభద్రాచార్య ఆసక్తికర వ్యాఖ్యలు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్.. పాకిస్తాన్ ఉగ్రమూకలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో పాక్ ఉగ్రమూకలకు భారత సైన్యం బుద్ధి చెప్పింది.
పాకిస్తాన్ పై తాజాగా ప్రముఖ స్వామి రాంభద్రాచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఆపరేషన్ సిందూర్ తగిన చర్య అని స్వామి రాంభద్రాచార్య పేర్కొన్నారు. ఇది చాలా మంచిదని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకలు అమాయక ప్రజలు చంపినందుకు మేము ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన తెలిపారు. ఇక కాల్పుల విరమణ రెండు రోజులు ఆలస్యం అయితే పాకిస్తాన్ ప్రపంచ పటములో నుంచి తుడిచిపెట్టుకుపోయేది స్వామి రాంభద్రాచార్య వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో నిన్న(శుక్రవారం) జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యకు 58వ జ్ఞానపీఠ్ అవార్డును అందజేశారు. భారత సాహిత్యానికి ఆయన చేసిన విశేష కృషికి గాను రాష్ట్రపతి తన ప్రసంగంలో జగద్గురు రాంభద్రాచార్యను అభినందించారు.






