- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టా ప్రేమ.. యువకుడి ప్రాణం తీసింది! ప్రియురాలు పరార్
ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో భర్త, పిల్లలను వదిలేసి వచ్చిన ఓ వివాహిత మోజులో పడిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో భర్త, పిల్లలను వదిలేసి వచ్చిన ఓ వివాహిత మోజులో పడిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తన ఖర్చులు భరించలేకపోతున్నావంటూ, తనను వదిలేసి వెళ్లిపోవాలని ప్రియురాలు చేసిన మానసిక వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బెంగళూరులోని రాజగోపాల్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి (28) స్థానికంగా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. దావణగెరెకు చెందిన ప్రియాంక అనే వివాహితతో అతడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో.. ప్రియాంక తన భర్తను, పిల్లలను వదిలేసి తిప్పేస్వామి వద్దకు వచ్చేసింది. గత రెండు నెలలుగా వీరిద్దరూ రాజగోపాల్ నగర్ (శ్రీగంధనగర) ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఇంటి యజమానికి భార్యాభర్తలుగా పరిచయం చేసుకొని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఒకే గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వేధింపులు.. రీల్స్ పిచ్చి
ప్రియాంక నిత్యం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తిప్పేస్వామిని పట్టించుకోవడం మానేసిందని తెలుస్తోంది. దీనికి తోడు, తన విలాసాలకు తగ్గ ఖర్చులను తిప్పేస్వామి భరించలేకపోతున్నాడని ఆమె తరచూ గొడవ పడేది సమాచారం. డబ్బులు లేనప్పుడు తనను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ, అతని ఆర్థిక పరిస్థితిని హేళన చేస్తూ తీవ్రస్థాయిలో మానసిక వేధింపులకు గురిచేసేది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తిప్పేస్వామి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రియుడు విగతజీవుడిగా కనిపించడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసుల దర్యాప్తు..
ప్రియాంక మానసిక వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తిప్పేస్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాజగోపాల్ నగర్ పోలీసులు ప్రియాంకపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment to suicide) కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






