- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారత నౌకాదళంలోకి INS తమాల్..యుద్ధనౌక ప్రత్యేకతలు ఇవే
నేడు భారత నౌకాదళంలోకి యుద్ధనౌక ఐఎన్ఎస్ తమాల్‌ను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధనౌకను రష్యా భారత్‌కు ఇవ్వనుంది.

దిశ, వెబ్ డెస్క్: నేడు భారత నౌకాదళంలోకి యుద్ధనౌక ఐఎన్ఎస్ తమాల్‌ను ప్రవేశపెట్టనున్నారు. రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధనౌకను రష్యా భారత్‌కు ఇవ్వనుంది. ఐఎన్ఎస్ తమాల్‌ను రష్యాలోని కాలివిన్‌గ్రాడ్‌లో భారత్‌కు అప్పగించనుండగా ఈ కార్యక్రమానికి కమాండింగ్ చీఫ్ సంజయ్ హాజరుకానున్నారు. ఈ యుద్ధనౌకలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 125 మీటలర్ల పొడవుతో 3,900 టన్నుల బరువులో ఈ యుద్ధనౌకను నిర్మించారు. ఈ యుద్ధనౌక అరేబియా సముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రంలో తన కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కరాచీకి సమీపంలో ఈ యుద్ధనౌక మోహరించనుంది.
ఈ నౌక భూమి మరియు సముద్ర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. ఐఎన్ఎస్ తమాల్ కీలక వ్యవస్థలలో 'SHTIL వర్టికల్ లాంచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఒకటి. ఇందులో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్, ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్స్ మరియు మీడియా రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ఉన్నాయి. ఈ నౌక క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు, బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాలను చేధించగలుగుతుంది. ఇది 'A-190-01' 100 mm నావల్ ఫిరంగి వ్యవస్థతో ఎంతో సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న క్రూయిజ్ క్షిపణుల కంటే ఐఎన్ఎస్ తమాల్ సమర్థవంతంగా లక్ష్యాలను చేధిస్తుంది. దీనిని కరాచీ సమీపంలో మోహరించడం ద్వారా శతృదేశం నుండి మరింత రక్షణ పొందవచ్చు.






