- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ins surat: ఇక పాక్‌తో తాడో పేడో.. ఉద్రిక్తతల వేళ భారత్ క్షిపణి ప్రయోగం
జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ బార్డర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ బార్డర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అట్టారీ సరిహద్దును భారత్ మూసి వేయగా వాఘా బార్డర్ ను క్లోజ్ చేస్తున్నట్టు పాక్ ప్రకటించింది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉగ్రదాడి తర్వాత సముద్ర భద్రతలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. నావికా దళ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తాజా గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ (Ins surat) సముద్రంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అరేబియా సముద్రంలో క్షిపణిని పరీక్షించగా సముద్ర ఉపరితలంపై దూసుకుపోతున్న వేగవంతమైన, తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసినట్టు ఇండియన్ నేవీ (Indian navy) తెలిపింది. నావికాదళ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొంది. దాడి జరిగినప్పుడు ఐఎన్ఎస్ సూరత్ శత్రు క్షిపణులను గుర్తించి వాటిని గాలిలో లేదా నీటిలో కాల్చి వేయగలదు. పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ పరీక్షలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.
మిలిటరీ చర్యకు రెడీ
భారత్ దౌత్యపరమైన చర్యల తర్వాత మిలిటరీ యాక్షన్ కూడా చేపట్టే చాన్స్ ఉన్నదన్న అంచనాలతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ సాయుధ బలగాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ పేర్కొంది. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం ఉన్నదని, వాటిని పరిరక్షించడానికి తమ ఆర్మీ సంసిద్ధంగా ఉన్నదని 2019 బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్‌ను ఉటంకిస్తూ తెలిపింది.






