వినూత్నంగా గణపతి నిమజ్జనం.. వీడియో వైరల్

by GSrikanth |   (  Updated:2023-09-22 13:48:11  IST  )

శ వ్యాప్తంగా ఈసారి గణపతి మండపాలు భారీగా ఏర్పాటు చేశారు. ఏ వీధిలో చూసినా భక్తి పాటలే మార్మోగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా వంటి నగరాల్లో అత్యంత గ్రాండ్‌గా ఈ పండగను జరుపుతుంటారు.

వినూత్నంగా గణపతి నిమజ్జనం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఈసారి గణపతి మండపాలు భారీగా ఏర్పాటు చేశారు. ఏ వీధిలో చూసినా భక్తి పాటలే మార్మోగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా వంటి నగరాల్లో అత్యంత గ్రాండ్‌గా ఈ పండగను జరుపుతుంటారు. దాదాపు పదిరోజుల పాటు ఈ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కొందరు మూడ్రోజుల్లో, ఐదు రోజుల్లో, ఏడు రోజుల్లోనూ నిమజ్జనాలు చేస్తారు. ఈ క్రమంలో బెంగళూరులో ఇవాళ చేసిన గణపతి నిమజ్జనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ క్రేన్ సాయంతో చిన్న చిన్న గణపతులు వాటంతట అవే వెళ్లి చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నిర్వహకులు, భక్తులు ఎవరూ నీటిలో అడుగుపెట్టకుండా బయటే ఉండి చూస్తు వీడ్కోలు పలికారు.

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/Qpx2nX6dPjE

Next Story