- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh Encounter : DRG బలగాల అమానవీయ చర్య.. మావోయిస్టుల మృతదేహాల ముందు డ్యాన్సులు!
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter)లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter)లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కూడా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్లోమావోయిస్టులను హతమార్చిన తర్వాత డీఆర్‌జీ బలగాలు(DRG Dance) తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయుధాలు చేతిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ జానపద సంగీతానికి నృత్యం చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మావోయిస్టుల మృతదేహాల ముందు డీఆర్‌జీ జవాన్లు నృత్యం చేస్తున్నట్లు కనిపించడం వివాదానికి దారితీస్తోంది. ఇది అమానవీయ చర్యగా పేర్కొన్న పౌరహక్కుల సంఘాలు... ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ వీడియో నవంబర్ 22, 2024న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన ఘటనగా తెలియజేస్తున్నారు.






