బ్రిక్స్ కూటమిలోకి కొత్త సభ్యదేశం.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ

by Naga Rani Yarlagadda |

ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న బ్రిక్స్ (BRICKS) కూటమి మరో కీలక సభ్యదేశాన్ని చేర్చుకుంది.

బ్రిక్స్ కూటమిలోకి కొత్త సభ్యదేశం.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న బ్రిక్స్ (BRICS) కూటమి మరో కీలక సభ్యదేశాన్ని చేర్చుకుంది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇండోనేషియాను పూర్తిస్థాయి సభ్యదేశంగా స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు హార్దిక స్వాగతం పలికారు.

ఈ పరిణామం భారత దేశానికి బహుళపక్ష వేదికలపై పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) దమ్ము రవి వెల్లడించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా అందించిన సౌజన్య ఆతిథ్యానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే బ్రిక్స్‌లో భాగస్వామిగా చేరిన ఇండోనేషియాకు పాజిటివ్ సంకేతం ఇచ్చారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో మాట్లాడుతూ, “గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తూ, ఆర్థిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సమన్యాయంగా అభివృద్ధి కోసం మా దేశం కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి 11 శాశ్వత సభ్యదేశాలు, 9 భాగస్వామ్య దేశాలు, 8 ఆహ్వానిత దేశాలు, 7 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవడం ద్వారా బ్రిక్స్ అంతర్జాతీయ వేదికగా ఎలా ఎదుగుతోందో స్పష్టమవుతోంది. 2026లో భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ సదస్సులో మోదీ పాల్గొనడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story