- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదన్న అధికారులు!
by Phanindra |
ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. అయితే సునామీ ముప్పు లేదని అధికారులు చెప్పారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆగ్నేయ ఇండోనేషియాలోని తానింబార్ దీవులను 6.8 మ్యాగ్నిట్యూడ్ భూకంపం కుదిపేసింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జడ్) తెలిపింది. దీని తీవ్రత తూర్పు ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి సునామీ ప్రమాదమేమీ లేదని పేర్కొంది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ఇది కేవలం 6.7 మ్యాగ్నిట్యూడ్ భూకంపమేనని, దీని కేంద్ర 98 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. దీని వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు రిపోర్టులు రాలేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
Next Story






