- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరా గాంధీ విజయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి: సోనియా గాంధీ
భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi's birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలతో దేశ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని నాయకులు, ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరానికి సంబంధించిన ఇందిరా గాంధీ పీస్, డిసార్మమెంట్ & డెవలప్మెంట్ అవార్డు కార్యక్రమంలో సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గోని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశాన్ని పేదరికం, అసమానతలు, వివక్ష, సంఘర్షణల నుండి విముక్తి చేయాలనే దృష్టితో పలు కీలక విధానాలు అమలు చేశారని ఆమె పేర్కొన్నారు.
“ పేదరికం, వ్యాధులు, అజ్ఞానం వంటి నిజమైన యుద్ధాలను ఎదుర్కోనడానికి శాంతి అవసరం” అని ఇందిరా గాంధీ చెప్పిన మాటలు ఇప్పటికీ సమకాలీనమని సోనియా గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ప్రజలపై అపారమైన ప్రేమ, మానవ హక్కుల పట్ల నిబద్ధత, అహింసపై అచంచల విశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపిన నాయకురాలని సోనియా గాంధీ అన్నారు. ఆమె సాధించిన విజయాలు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ వారసత్వం ఇప్పటికీ కోట్ల మందిని ప్రేరేపిస్తోందని సోనియా గాంధీ స్పష్టం చేశారు.






