IndiGo Pilot: ‘చెప్పులు కుట్టుకోపో’ ఆకరికీ.. విమానయాన రంగంలో కూడా కుల వివక్ష!

by Ramesh Naini |

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఓ ట్రైనీ పైలట్‌ను కులం పేరుతో సహోద్యోగులు దూషించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

IndiGo Pilot: ‘చెప్పులు కుట్టుకోపో’ ఆకరికీ.. విమానయాన రంగంలో కూడా కుల వివక్ష!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ (IndiGo) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఓ ట్రైనీ పైలట్‌ను కులం పేరుతో (caste-based harassment) సహోద్యోగులు దూషించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను చమార్, భంగీ వంటి పదజాలంతో దూషించారని బాధితుడు అశోక్ కుమార్ (35) ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సహోద్యోగులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రారంభంలో ఈ కేసును బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్‌గా నమోదు చేశారు. కానీ తర్వాత గుర్గావ్‌లోని డీఎల్ఎఫ్-1 పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. ఫిర్యాదులో తెలిపిన ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీ పైలట్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను ఆయన సహోద్యోగులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషించి, అవమాన పరిచారని ఆరోపించారు.

తనను చమార్, భంగీ అంటూ దూషించారని, విమానం నడపడానికి, కాక్‌పిట్‌లో కూర్చోవడానికి అర్హత లేదని అవమానించారని బాధితుడు పేర్కొన్నారు. వెళ్లి చెప్పులు కుట్టుకో.. నీ కులవృత్తి అదే కదా.. మా బూట్లు నాకడానికి కూడా పనికిరావంటూ కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచాయని బాధితుడు వాపోయారు. ఈ ఘటనతో విమానయాన రంగంలో కుల వివక్షపై తీవ్ర చర్చకు దారితీసింది. ఆకరికీ విమానయాన రంగంలో కూడా కుల వివక్ష ఉందని బహిర్గతమైందని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. భాదితుడు ఆశోక్ కుమార్‌కు న్యాయం చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని, సంస్థ కూడా దీనిపై స్పందించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Next Story