- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indigo: ఇండిగో విమానం నుంచి మేడే కాల్.. గువహటి-చెన్నయ్ ప్లైట్‌కు తప్పిన ముప్పు
ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తమై ఏటీసీకి మేడే కాల్ సమాచారం అందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండిగో ఎయిర్ లైన్స్ (Indigo airlines) కు చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి మేడే కాల్ సమాచారం అందించడంతో సురక్షితంగా బయటపడింది. వివరాల్లోకెళ్తే..168 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో విమానం గువహటి నుంచి చెన్నయ్ కి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉన్న విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఏటీసీకి అత్యవసరంగా మేడే కాల్ మెసేజ్ ఇచ్చారు. దీంతో విమానాన్ని వెంటనే బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జూన్ 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు సహా మొత్తం 270 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఘటన జరగడంతో ఆందోళన నెలకొంది.






