- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికుల డబ్బుల రీఫండ్ పై కీలక ప్రకటన చేసిన ఇండిగో
దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo crisis) విమాన సేవలకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo crisis) విమాన సేవలకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ప్రయాణ చార్జీలు క్రమబద్దీకరిచింది. కొత్తగా నిర్ణయించిన చార్జీలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అన్ని విమాన సంస్థలకు విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో అవకాశవాదమా అంటూ వారిపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్ లైన్స్ కు హెచ్చరించింది. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే వరుసగా జరిగిన విమానాల రద్దు నేపథ్యంలో.. ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు పెద్ద ఊరట కల్పించే నిర్ణయాన్ని ప్రకటించింది. టిక్కెట్ రద్దు చేసుకున్న వారికి చెల్లించాల్సిన రిఫండ్‌లన్నీ ఇకపై స్వయంచాలకంగా (automatically) ప్రయాణికులు చెల్లింపు చేసిన పద్ధతిలోనే (original mode of payment) జమ చేయబడతాయని ప్రకటించింది. ఈ నిర్ణయంతో రిఫండ్‌ల కోసం వేచి చూడాల్సిన అవసరం తగ్గునుంది.
ముఖ్యంగా 2025 డిసెంబర్ 5 నుంచి 2025 డిసెంబర్ 15 మధ్య ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణికులకు, వారి బుకింగ్‌లను రద్దు చేసుకున్నా, ప్రయాణ తేదీలను మార్చుకున్నా (reschedule), ఇండిగో పూర్తి ఛార్జ్ మినహాయింపు (full waiver) అందిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఈ నిర్దిష్ట కాలంలో ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాలనుకునే వారికి ఆర్థిక భారం లేకుండా సులభతరం చేసింది. ఇప్పటికే విమాన సర్వీసులు ఆలస్యం కావడం, రద్దు కావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఉపశమనాన్ని కలిగించింది.






