- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇండిగో
ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. చండీగఢ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా అనుకూలత తగ్గిందని,

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. చండీగఢ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా అనుకూలత తగ్గిందని, ఈ కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. పరిస్థితులను తాము పరిశీలిస్తున్నామని సాధారణ స్థితికి వచ్చిన వెంటనే మీ గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరుస్తామని తెలిపింది.
ఫ్లైట్ స్టేటస్ తెలుసుకునేందుకు యాప్, వెబ్ సైట్‌లో అప్డేట్‌గా ఉండాలని సూచించింది. త్వరలో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహకరిస్తున్నందుకు ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఇండిగో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండిగో అంతరాయం లేకుండా విమానాలను నడిపిస్తోంది.






