- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 వ రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 56 విమానాలు రద్దు
దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం (IndiGo Airlines crisis) కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది. ఈ సంక్షోభం ప్రభావం కారణంగా ఇండిగో సేవలు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు కాగా, వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇలా మొత్తం 56 విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ అనూహ్య రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై, గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు విమానాల రద్దుల పరంపర పై పౌర విమానయాన శాఖ (DGCA) తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను వివరించేందుకు విమానయాన సంస్థల ఉన్నతాధికారులు త్వరలో DGCA ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడానికి, ప్రయాణికులకు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 10 నాటికి ఇండిగో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని, సమస్య పూర్తిగా సర్దుమనుగుతుందని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే.






