- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా ఆరో రోజు ఇండిగో సంక్షోభం కొనసాగింపు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం ఆరో రోజుకు చేరింది. సిబ్బంది కొరతతో పాటు ఇతర నిర్వహణ సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తలెత్తిన సంక్షోభం ఆరో రోజుకు చేరింది. సిబ్బంది కొరతతో పాటు ఇతర నిర్వహణ సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారాయి. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్, డిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, పట్నా, గోవా, గౌహతి సహా ఇతర పెద్ద ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను (రైలు, ఆర్టీసీ) అన్వేషించడం అనివార్యమైంది. ఈ సంక్షోభం కారణంగా ఇండిగో బుకింగ్‌లు చేసుకున్న పర్యాటకులు, అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు. ఇండిగో విమానయాన సంస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆరో రోజు కూడా రద్దు కొనసాగడంపై ప్రయాణికులు, పర్యాటక రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






