- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా
దేశీయ విమానయాన దిగ్గజం 'ఇండిగో' (IndiGo) సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన దిగ్గజం 'ఇండిగో' (IndiGo) సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. విమానయాన కార్యకలాపాల్లో గత మూడు నెలలుగా ఎదురవుతున్న తీవ్ర అంతరాయాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొత్త సీఈఓను నియమించే వరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా ఎయిర్‌లైన్స్ బాధ్యతలను చూస్తారని సంస్థ ప్రకటించింది.
ఇండిగో అధికారిక ప్రకటన:
"పీటర్ ఎల్బర్స్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. సంస్థకు ఆయన అందించిన సేవలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై బోర్డు చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. "కంపెనీ సంస్కృతిని బలోపేతం చేయడానికి, కార్యకలాపాల్లో అత్యుత్తమ ప్రమాణాలను (Operational Excellence) నెలకొల్పడానికి మరియు కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రాహుల్ భాటియా మళ్ళీ పగ్గాలు చేపడుతున్నారు" అని పేర్కొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేస్తాం: రాహుల్ భాటియా
తన పునరాగమనంపై రాహుల్ భాటియా స్పందిస్తూ.. "ఇండిగోను స్థాపించి 22 ఏళ్లుగా పెంచి పోషించిన వ్యక్తిగా, దేశం పట్ల, మా కస్టమర్లు, ఉద్యోగులు మరియు వాటాదారుల పట్ల నాకు ఎంతో బాధ్యత ఉంది. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడేలా, వృత్తిపరంగా ఇండిగోను మరింత ముందుకు తీసుకెళ్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.






