దేశవ్యాప్తంగా మరో 400 ఇండిగో విమానాల రద్దు

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈరోజు మరో 400 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.

దేశవ్యాప్తంగా మరో 400 ఇండిగో విమానాల రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈరోజు మరో 400 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అందులో ఢిల్లీలో 134 విమానాలు, బెంగుళూరులో 127, హైదరాబాద్ లో 112, చెన్నైలో 71, అహ్మదాబాద్ తోపాటు ముంబై, కోల్కతా, విశాఖపట్నంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికులు తాజా సమాచారం కోసం విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని ఎయిర్ పోర్ట్స్ ప్రయాణికులను కోరుతున్నాయి. మార్పులపై అలర్ట్ గా ఉండాలని, విమానాశ్రయాలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఇండిగో విమానాలు వందలాది రద్దవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

Next Story