సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన

by Ajay Maddhiboyina |

సంక్షోభం వేళ ఇండిగో ఎయిర్ లైన్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 3వ తేదీ నుండి 15వ తేదీ మ‌ధ్య ర‌ద్దు చేయ‌బ‌డిన విమానాల టికెట్ ఛార్జీలు రీఫండ్ ప్రాసెస్ జ‌రుగుతోంద‌ని పేర్కొంది.

సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: సంక్షోభం వేళ ఇండిగో ఎయిర్ లైన్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 3వ తేదీ నుండి 15వ తేదీ మ‌ధ్య ర‌ద్దు చేయ‌బ‌డిన విమానాల టికెట్ ఛార్జీలు రీఫండ్ ప్రాసెస్ జ‌రుగుతోంద‌ని పేర్కొంది. డిసెంబర్ 15 వరకు చెల్లుబాటు అయ్యే బుక్సింగ్స్ లో మార్పు, రద్దు అభ్యర్థనలపై మినహాయింపు అందిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. ప్రయాణికులకు అంతరాయం కలిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నామని, వీలైనంత త్వరగా కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఇండిగో సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంది.

టికెట్ ర‌ద్దు చేసిన వివ‌రాల‌ను లింక్ లో న‌మోదు చేయాల‌ని ఒకటి రెండు ట్రాన్సాక్ష‌న్స్ లో మీ ఖాతాలో డ‌బ్బులు వేస్తామ‌ని పేర్కొంది. త‌మకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యదావాలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇండిగో విమానాలు ర‌ద్దు అవ్వ‌డం, ఆల‌స్యం అవ్వ‌డంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు త‌మ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. వేల రూపాయ‌లు పెట్టి టికెట్ల‌ను కొనుగోలు చేయ‌గా రిఫండ్ అవుతుందో లేదో అని ఆందోళ‌న చెందారు. తాజాగా ఇండిగో చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఊపిరి పీల్చుకున్నారు.

Next Story