- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.22.2 కోట్ల జరిమానా
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ (Directorate of civil aviation) భారీ జరిమానా విధించింది. విమానాల అంతరాయం వెనుక ప్రణాళిక, కార్యాచరణ లోపాలు ఉన్న నేపథ్యంలో రూ.22.2 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ (Directorate of civil aviation) భారీ జరిమానా విధించింది. విమానాల అంతరాయం వెనుక ప్రణాళిక, కార్యాచరణ లోపాలు ఉన్న నేపథ్యంలో రూ.22.2 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అంతే కాకుండా విమాన కార్యకలాపాలు, సంక్షోభ నిర్వహణపై తగినంత పర్యవేక్షణ లేకపోవడంతో ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ ను హెచ్చరించింది.
ఇండిగో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్ కెప్టెన్ అషిమ్ మిత్రాను తొలగించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చాలా విమానాలు రద్దు అవ్వడంతో పాటు ఆలస్యంగా నడిచాయి. దీంతో విమానాశ్రయాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చేశారు. ఇండిగో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్లు రద్దు చేయడంతో ఆకస్మిక ప్రయాణాలు ఉన్నవారు సైతం వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ సీరియస్ గా తీసుకుని హెచ్చరికలు జారీ చేసింది.






