భద్రత, ఉగ్రవాదంపై ఐరాసలో భారత్ గళం.. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆందోళన

by Malleboina Mahesh |

ఐక్యరాజ్యసమితి (UN)లో భారత శాశ్వత ప్రతినిధి, పర్వతనేని హరీష్, ఆఫ్ఘనిస్తాన్‌లోని క్లిష్ట పరిస్థితులు, పెరుగుతున్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

భద్రత, ఉగ్రవాదంపై ఐరాసలో భారత్ గళం.. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఐక్యరాజ్యసమితి (UN)లో భారత శాశ్వత ప్రతినిధి, పర్వతనేని హరీష్, ఆఫ్ఘనిస్తాన్‌లోని క్లిష్ట పరిస్థితులు, పెరుగుతున్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది 2 మిలియన్ల మంది ఆఫ్ఘన్ల అనివార్య స్వదేశీ రాకపోకల కారణంగా, 2025 నాటికి ఆఫ్ఘనిస్తాన్ జనాభా 6% పెరిగే అవకాశం ఉందని, ఇది తీవ్రమైన పెళుసుదనం (vulnerabilities),సవాళ్లను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మెరుగైన రక్షణ, ఆశ్రయం, ఆహార భద్రత, స్థిరమైన పునరేకీకరణకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని భారత్ ఈ సందర్భంగా నొక్కి చెప్పింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితిని భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)చే నిషేధించబడిన ISIL, అల్ ఖైదా, వాటి అనుబంధ సంస్థలు, ముఖ్యంగా లష్కరే తయ్యబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM) వంటి సంస్థలు, అలాగే LeT ప్రాక్సీలైన రెసిస్టెన్స్ ఫ్రంట్ వారి కార్యకలాపాలకు సహకరించేవారు సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడకుండా చూసేందుకు అంతర్జాతీయ సమాజం సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ ఐక్యరాజ్యసమితి దేశాలకు, సభ్యులకు పిలుపునిచ్చారు.

Next Story