ఉగ్రవాదంపై మా తీరు స్పష్టం.. అర్థం చేసుకుంటే మంచిది: జైశంకర్

by Phanindra |

ఉగ్రవాదంపై భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, దీన్ని తమ భాగస్వాములు కూడా అర్థం చేసుకుంటే మంచిదని జైశంకర్ స్పష్టంచేశారు.

ఉగ్రవాదంపై మా తీరు స్పష్టం.. అర్థం చేసుకుంటే మంచిది: జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని, జోరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేసేందుకు పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన యూకే ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లామీతో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే భారత్, పాక్ ఉద్రిక్తతల తర్వాత ఇరుదేశాల మధ్య సారూప్యతను తీసుకొచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నం చేయడంపై కూడా జైశంకర్ స్పందించారు.


‘మేం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించం. ఈ విషయాన్ని మా భాగస్వాములు అర్థంచేసుకోవాలి. అలాగే ఇలాంటి ఘోరాలు చేస్తున్న దుర్మార్గులతో బాధితులను కలిపిచూడటాన్ని మేం ఎప్పటికీ సమర్థించం’ అని జైశంకర్ తేల్చిచెప్పారు. అదే సమయంలో పహెల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా ఉన్నందుకు యూకేకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story