- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13,700 అడుగుల ఎత్తులో ఎయిర్‌ఫీల్డ్.. సైన్యానికి కీలకం!
by Phanindra |
13,700 అడుగుల ఎత్తులో నిర్మించిన ఎయిర్‌ఫీల్డ్ సేవలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. చైనా సరిహద్దులోని ఇది సేనకు చాలా కీలకం కానుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: చైనా సరిహద్దుకు సమీపంలో లద్దాఖ్‌లో ఏకంగా 13,700 అడుగుల ఎత్తులో నిర్మించిన ఎయిర్‌ఫీల్డ్.. భారత రక్షణ విభాగానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఎయిర్ ఫీల్డ్ పూర్తి ఆపరేషనల్‌గా మారినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. న్యోమా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్‌జీ) ఇప్పుడు భారత సేనలకు పూర్తిస్థాయిలో సేవలందిస్తుందని రక్షణ రంగం తెలిపింది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్.. డిఫెన్స్ కనెక్టివిటీకి కీలకం కానుందని నిపుణులు చెప్తున్నారు. 2021లో రూ.214 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఇంత ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్.. వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. దీన్ని ర్యాపిడ్ రెస్పాన్స్ బేస్‌గా ఉపయోగించవచ్చని తెలిపారు.
Next Story






