- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NSO: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరోగమనం- ఎన్ఎస్ఓ నివేదికలో వెల్లడి
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరోగమించింది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం (NSO) శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరోగమించింది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం (NSO) శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోని మూడో (అక్టోబరు- డిసెంబరు) త్రైమాసికంలో దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) వృద్ధిరేటు 6.2 శాతానికి మందగించింది. తయారీ, మైనింగ్ రంగాల్లో పేలవతీరు కార్యకలాపాల వల్లే ఇలా జరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు అత్యధికంగా 9.5 శాతంగా నమోదైంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోని జులై-సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.6 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటుకు సంబంధించిన అంచనాలను ఎన్ఎస్‌ఓ ఇప్పటికే ఒకసారి మార్చుకుంది. జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగా ఉండొచ్చని తొలిసారి అంచనా వేసింది. అయితే, జాతీయ పద్దుల అంచనాలతో రెండోసారి విడుదల చేసిన నివేదికలో వృద్ధిరేటు 6.5 శాతానికి చేరొచ్చని ఎన్ఎస్ఓ పేర్కొంది. అంతకుముందు, 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధంగా జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 8.2 శాతం నుంచి 9.2 శాతానికి ఎన్ఎస్‌ఓ సవరించింది.






