Bullet Train : భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ అప్డేట్స్

by Muthe.Rajitha |

భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్(Bullet Train) త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.

Bullet Train : భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ అప్డేట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్(Bullet Train) త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆధ్వర్యంలో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 300 కిమీల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) తెలియజేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు(Bullet Train Project) పనుల పురోగతిపై వివరాలు వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు(MAHSR) ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మంత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో వీడియోతో సహా షేర్ చేశారు. ఈ 508 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌లో 300 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించారు.

రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చుతో జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇది కీలక మైలురాయిగా పేర్కొన్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లో భూగర్భ స్టేషన్ నిర్మాణంలో 76% పనులు పూర్తయ్యాయని, ఈ స్టేషన్ బహుళ అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందుతోందని అన్నారు. అలాగే 344 కిమీల ఫౌండేషన్, 272 కిమీల పియర్ నిర్మాణం, 153 కిమీల గిర్డర్ కాస్టింగ్, 122 కిమీల గిర్డర్ లాంచింగ్ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 320 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Next Story