World Bank: వచ్చే రెండేళ్లపాటు 6.7 శాతంగా భారత ఆర్థిక వృద్ధి- ప్రపంచ బ్యాంకు

by Shamantha N |

వచ్చే రెండేళ్లపాటు భారత ఆర్థిక వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు(World bank) అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు గురువారం గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ నివేదికను విడుదల చేసింది.

World Bank: వచ్చే రెండేళ్లపాటు 6.7 శాతంగా భారత ఆర్థిక వృద్ధి- ప్రపంచ బ్యాంకు
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే రెండేళ్లపాటు భారత ఆర్థిక వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు(World bank) అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు గురువారం గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ నివేదికను విడుదల చేసింది. అందులో భారత్‌ వృద్ధి అంచనాలను ప్రస్తావించింది, ఏప్రిల్‌ 2025 నుంచి ప్రారంభమయ్యే రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని తెలిపింది. భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంటుందని పేర్కొంది. సేవారంగం మరింతగా విస్తరిస్తుందని తెలిపింది. ప్రభుత్వ సహకారంతో సేవారంగం విస్తరించడమే కాకుండా, తయారీ, వ్యాపారరంగం పుంజుకుంటుందని పేర్కొంది. పెట్టుబడి వృద్ధి స్థిరంగా ఉంటుందని వెల్లడించింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది పెట్టుడులు మందగించడం, బలహీనమైన తయారీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఇకపోతే, 2026 ఆర్థిక సంవత్సరానికి గానూ గతంలో ఇచ్చిన అంచనాలను సవరించనప్పటికీ.. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను 0.1 శాతం తగ్గించింది.

Next Story