Bangladesh : భారత విదేశాంగ శాఖతో చర్చలు.. బంగ్లాదేశ్ సంచలన ప్రకటన

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో: భారత(India) విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రితో భేటీ అనంతరం బంగ్లాదేశ్(Bangladesh) విదేశాంగశాఖ కార్యదర్శి మహ్మద్ జషీముద్దీన్‌ కీలక ప్రకటన విడుదల చేశారు.

Bangladesh : భారత విదేశాంగ శాఖతో చర్చలు.. బంగ్లాదేశ్ సంచలన ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత(India) విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రితో భేటీ అనంతరం బంగ్లాదేశ్(Bangladesh) విదేశాంగశాఖ కార్యదర్శి మహ్మద్ జషీముద్దీన్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై మేం కామెంట్స్ చేయం. మా దేశం విషయంలోనూ ఇతర దేశాలు అదేవిధంగా గౌరవభావంతో వ్యవహరించాలి’’ అని జషీముద్దీన్‌ కోరారు.

‘‘బంగ్లాదేశ్‌లో ఏదైనా జరిగితే భారత మీడియాలో నెగెటివ్ కోణంలో ప్రచారం చేస్తున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని ఆపడం ద్వారా భారత్ మాకు సహకరించాలి. తద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య విశ్వాస భావన బలోపేతం అవుతుంది’’ అని ఆయన కోరారు. జులై - ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంపైనా భారత మీడియాలో తప్పుడు ప్రచారమే జరిగిందన్నారు. బంగ్లాదేశ్‌లో అన్ని మతాల ప్రజలు(Bangladesh Minorities) వారివారి పద్ధతుల్లో స్వేచ్ఛగా పూజలు, ప్రార్థనలు చేసుకుంటున్నారని జషీముద్దీన్‌ స్పష్టంచేశారు.

Next Story