Covid: దేశంలో మళ్లీ కరోనా పంజా.. 2,710 యాక్టివ్ కేసులు.. 7 మరణాలు

by Prasad Jukanti |

దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది

Covid: దేశంలో మళ్లీ కరోనా పంజా.. 2,710 యాక్టివ్ కేసులు.. 7 మరణాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి కరోనా వైరస్ (Corona Virus) పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల (Corona Active Cases) సంఖ్య 2,710 కు పెరిగిందని 1,170 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడి ఏడుగురు మరణించినట్లు తెలిపింది. అత్యధికంగా కేరళలో 1,147 యాక్టివ్ కేసులు , మహారాష్ట్రలో 424, ఢిల్లీ 294, గుజరాత్ 223 కేసులు ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 116 కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. గడిచిన నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ మాట్లాడుతూ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Next Story