- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రెండు దేశాలకు ట్రావెల్ సేవలు నిలిపివేత.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లలో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేయడంపై ప్రపంచ దేశాలు మద్దతు తెలుపగా.. ఈ రెండు దేశాలు మాత్రం పాక్‌పై భారత్ విమానిక దాడుల్ని ఖండించాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ టర్కీ, అజర్ బైజాన్‌లకు ట్రావెల్ సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు పలు బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధం వేళ ఈ రెండు దేశాలు పాకిస్థాన్‌కు మద్దతివ్వడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా బుకింగ్ సంస్థలు వెల్లడించాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లలో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేయడంపై ప్రపంచ దేశాలు మద్దతు తెలుపగా.. ఈ రెండు దేశాలు మాత్రం పాక్‌పై భారత్ విమానిక దాడుల్ని ఖండించాయి. పాకిస్థాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్న అజర్ బైజాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై తమ దేశం ఆందోళన వ్యక్తం చేస్తుందని పేర్కొంది. పాకిస్థాన్‌పై భారత్ చేసిన వైమానిక దాడుల్ని ఖండిస్తున్నామని, పాక్‌కు సంఘీభావంగా ఉంటామని ప్రకటించింది. టర్కీకూడా పాక్‌కు సపోర్ట్ చేసింది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సంఘీభావం తెలిపారు. పాక్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దీంతో భారతీయులు ఈ రెండు దేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకుని.. బాయ్ కాట్ టర్కీ, బాయ్ కాట్ అజార్ బైజాన్ అని, బాయ్ కాట్ టర్కిష్ ఎయిర్ లైన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బాయ్ కాట్ టర్కీ ఉద్యమం చేపట్టాలని పిలుపునిస్తున్నారు. ఇండియన్స్ ఈ రెండు దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో..ట్రావెల్ టూరిజం కంపెనీలు టర్కిష్ సంస్థలతో ఉన్న పార్ట్నర్ షిప్ ను రద్దు చేసుకుంటున్నాయి.






