- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాటరీ లక్కీ డ్రా లో కోట్ల రూపాయలు గెలుచుకున్న ఇండియన్.. కానీ
యూఏఈలో తీసిన లాటరీ లక్కీ డ్రాలో ఇండియన్ ను అదృష్టం వరించింది.

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈలో తీసిన లాటరీ లక్కీ డ్రాలో ఇండియన్ ను అదృష్టం వరించింది. ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ "బిగ్ టికెట్ అబుధాబి 280" సిరీస్ లో శరవణన్ వెంకటాచలం అనే ఇండియన్ 25 మిలియన్ల దిర్హామ్స్ (రూ.60.42 కోట్లు) గెలుచుకున్నారు. తరచూ అక్కడ ఈ లక్కీ డ్రా తీస్తుంటారు. అక్టోబరు 30వ తేదీన 463221 నంబర్ తో ఉన్న టికెట్ ను కొనుగోలు చేసిన ఆయనకు.. నవంబర్ 3న తీసిన లక్కీ డ్రా లో ఇంత పెద్ద మనీ ప్రైజ్ జాక్ పాట్ గా తగిలింది. కానీ.. ఆయనకు ఈ విషయం చెప్పేందుకు పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తామని నిర్వాహకులు తెలిపారు. కొద్దిసేపటికే వెంకటాచలం స్పందించాడు. షో నిర్వాహకులు కాల్ చేసినపుడు తాను ఆఫీసులో ఉన్నానని, తన భార్య, ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకున్నానని వెంకటాచలం తెలిపాడు. లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకోవడాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.






