సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. భారత మహిళ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

సింగపూర్‌లో అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా నడుస్తున్నా అంటూ కృతికా జైన్ అనే ఓ భారత మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. భారత మహిళ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: సింగపూర్‌లో అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా నడుస్తున్నా అంటూ కృతికా జైన్ అనే ఓ భారత మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. చుట్టూ ఎవరూ లేరని సింగిల్ గా నడుస్తున్నానని తెలిపింది. ఇదే పరిస్థితి భారత దేశంలో ఎదురైతే భయంతో వణికిపోయేదానినని చెప్పింది. ఇలాంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేం అంటూ వ్యాఖ్యానించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కొంత‌కాలంగా సింగ‌పూర్ లోనే ఉంటున్నాన‌ని రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి భ‌యం లేకుండా ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళుతున్నాని చెప్పింది.

ఇదే స‌మ‌యంలో భార‌త్ లో అయితే ఇంట్లో నుండి బ‌య‌ట అడుగుపెట్టాల‌న్నా భ‌య‌ప‌డేదానిన‌ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సింగపూర్ లో త‌న‌కు ప‌ర్యాట‌క ప్రాంతాల క‌న్నా అర్ధ‌రాత్రి మ‌హిళ‌లు నిర్భ‌యంగా బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌లిగే అవ‌కాశం ఉండ‌ట‌మే బాగా న‌చ్చిన విష‌యం అని చెప్పింది. ఇండియాలో మాదిరిగా భ‌ద్ర‌త అనేది సింగ‌పూర్ లో ల‌గ్జ‌రీ కాద‌ని సామాన్యుల‌కు కూడా అందుబాటులో ఉండే నిత్యావ‌స‌రం లాంటిది అని పేర్కొంది. మ‌హిళ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో కొంత‌మంది ఆమెకు స‌పోర్ట్ చేస్తుంటే మ‌రికొంద‌రు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story