- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాలకు వెళ్లి మీరు చేసేవి ఇలాంటి పనులా? ఇండియా పరువు తీస్తున్నారుగా!
చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి దేశం పేరు నిలబెడుతున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వాళ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన విదేశీ కంపెనీలకు సీఈవోలుగా ఎదిగి భారతీయులు తలెత్తుకునేలా చేశారు. వీళ్లు మాత్రమే కాకుండా చాలా మంది ఎన్నారైలు విదేశాల్లో పార్ట్ టైం చేసుకుంటూ

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి దేశం పేరు నిలబెడుతున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వాళ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన విదేశీ కంపెనీలకు సీఈవోలుగా ఎదిగి భారతీయులు తలెత్తుకునేలా చేశారు. వీళ్లు మాత్రమే కాకుండా చాలా మంది ఎన్నారైలు విదేశాల్లో పార్ట్ టైం చేసుకుంటూ, ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కొందరు మాత్రం దేశం పేరు చెడగొట్టడానికే విదేశాలకు వెళ్లినట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు ఘటనలే నిదర్శనం.
అమెరికాలోని ఓ క్లాత్ స్టోర్‌లో ఇండియాకు చెందిన గుజారాతీ యువతి దుస్తులు దొంగలించి పట్టుబడింది. 7 టాప్స్, 3 జీన్స్ తో పాటు 5 జతల ఇన్నర్ దుస్తులు సైతం దొంగలించింది. యువతిని సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ప్రశ్నించగా తనది ఇండియా గుజరాత్ అని చెప్పింది. దీంతో పోలీసులు వచ్చి నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అన్నారు. పోలీసులు మాట్లాడుతున్న సమయంలో సమాధానం చెప్పలేక యువతి వణికిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక మరో వీడియోలో కెనడా (canada)లో ఓ యువతి మెట్రో స్టేషన్‌లో కూర్చుని ఆర్థికసాయం కోసం ఆర్జిస్తూ కనిపించింది. వీడియో తీస్తున్న సమయంలో కనిపించకుండా ముఖానికి ఓ పేపర్ అడ్డుపెట్టుకుంది. తరవాత అక్కడ నుండి లేచి వెళ్లిపోతూ వీడియో తీస్తున్న వ్యక్తికి బూతు సైగ చేస్తూ ఆగ్రహంగా వెళ్లిపోయింది. ఈ రెండు వీడియోలు తెగ వైరల్ అవుతుండగా ఇండియాను కించపరుస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. భారతీయ మహిళలు (indian women) ఫ్రీగా భర్తల నుండి భరణం కావాలి లేదంటే ఇలా ఉచితంగా అన్నీ దొరకాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారతీయులు విదేశాలకు వెళ్లి మీరు చేసేవి ఇలాంటి పనులా..ఇండియా పరువు తీస్తున్నారుగా అంటూ మండిపడుతున్నారు.






