- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో భారత టెకీ దారుణం.. భార్య, కొడుకును చంపి.. తాను ఆత్మహత్య
అమెరికాలో (America) దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) దారుణ ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్‌లోని న్యూకాజిల్ పట్టణంలో నివాసముంటున్న భారత టెకీ హర్షవర్థన్ ఎస్ కిక్కేరి (Harshavardhana S Kikkeri)(57).. ఆయన భార్య శ్వేతా పాణ్యం(44), వారి 14 ఏళ్ల కుమారుడు ధ్రువను తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో వీరి మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏప్రిల్ 24న ఈ దారుణ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ అమానుష చర్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, హర్షవర్ధన్ స్వస్థలం కర్ణాటకలోని (Karnakata) మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకా. రోబోటిక్స్ రంగంలో నిపుణుడైన ఆయన గతంలో అమెరికాలోని ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థలో కూడా పనిచేశారు. అనంతరం 2017లో భార్య శ్వేతతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి మైసూరు కేంద్రంగా హోలోవరల్డ్ (Holoworld) అనే రోబోటిక్స్ కంపెనీని స్థాపించారు. శ్వేత కూడా ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. ఉవ్వెత్తున దూసుకెళ్లిన ఈ సంస్థ కార్యకలాపాలు కరోనా మహమ్మారి ప్రభావంతో 2022లో నిలిచిపోయాయి. దీంతో హర్షవర్ధన తిరిగి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
హర్షవర్థన్ భార్యభర్తలు.. హోలోవరల్డ్‌ను ఏర్పాటు చేసి స్కిల్ మెటావర్స్ అనే భావనతో మనుషులు, రోబోట్ల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మెటావర్స్‌ను నిర్మించాలని భావించారు. కానీ, కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండికొట్టింది. హర్షవర్థన్ సంస్థ ఏర్పాటు అనంతరం కోవిడ్‌కు ముందు ప్రధాని మోడీని కలిసి సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ముందుంచారు.






