వందేభారత్ స్లీపర్ టికెట్లపై రైల్వేశాఖ కీలక ప్రకటన.. క్యానిలేషన్ రూల్స్ మరింత కఠినం

by Naga Rani Yarlagadda |

రైలుపట్టాలపై వందేభారత్ స్లీపర్ ట్రైన్ పరుగులు మొదలయ్యాయి. ఫస్ట్ రన్ లో ప్రయాణికులు సూపర్ ఫీచర్స్ అంటూ.. మోదీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు.

వందేభారత్ స్లీపర్ టికెట్లపై రైల్వేశాఖ కీలక ప్రకటన.. క్యానిలేషన్ రూల్స్ మరింత కఠినం
X

దిశ, వెబ్‌డెస్క్: రైలుపట్టాలపై వందేభారత్ స్లీపర్ ట్రైన్ పరుగులు మొదలయ్యాయి. ఫస్ట్ రన్ లో ప్రయాణికులు సూపర్ ఫీచర్స్ అంటూ.. మోదీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్రమంలో టికెట్ ధరలపై రైల్వే మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ వంటి రైళ్లలో చార్ట్ ప్రిపరేషన్ కు 4 గంటల ముందు వరకూ టికెట్ క్యాన్సిల్ చేసినా కొంత అమౌంట్ రిటర్న్ వచ్చేది. వందేభారత్ స్లీపర్ లో టికెట్ క్యాన్సిలేషన్ సమయంలో మార్పులు చేశారు. రైల్వే పాసింజర్స్ రూల్స్ 2015ను ఈ మేరకు సవరించారు.

72 గంటలకు ముందు క్యాన్సిల్ చేస్తే.. టికెట్ ఛార్జీలో 25 శాతం కట్ అవుతుంది. 72 గంటల నుంచి 8 గంటల మధ్యలో క్యాన్సిల్ చేస్తే 50 శాతం అమౌంట్ కట్ అవుతుంది. 8 గంటలకు ఒక్కనిమిషం తక్కువ ఉన్నపుడు క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. సీటు రిజర్వేషన్ చేసుకున్న కోచ్ లను బట్టి క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఇక వందేభారత్ స్లీపర్ లో నో ఆర్ఏసీ, నో వెయిటింగ్ లిస్ట్ అని రైల్వేశాఖ ఇప్పటికే వెల్లడించింది. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బెర్తుల్ని ఆటోమెటిక్ గా కేటాయిస్తుంది.

Next Story