రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

by Ajay Maddhiboyina |

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప‌లు ప్ర‌త్యేక రైళ్ల సేవ‌ల‌ను న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
X

దిశ‌, వెబ్ డెస్క్: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప‌లు ప్ర‌త్యేక రైళ్ల సేవ‌ల‌ను న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తిరుపతి-షిర్డీ, న‌ర‌సాపురం-త‌రువ‌ణ్ణామ‌లై లాంటి మార్గాల‌లో వారంత‌పు ప్ర‌త్యేక రైళ్లు న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.

అంతే కాకాకుండా హైద‌రాబాద్- క‌న్యాకుమారి, కాచిగూడ‌-మ‌ధురై, హైద‌రాబాద్-కొల్లాం రైళ్ల‌ను కూడా పొడిగించింది. ఇదిలా ఉంటే పండుగ‌ల స‌మ‌యాల్లో స‌రిపోయే అన్ని బ‌స్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది ప‌డుతుంటారు. స్కూళ్ల‌కు , ఆఫీసుల‌కు సెల‌వులు ఉండ‌టంతో ఇత‌ర ప్రాంతాల్లో నివ‌సించేవాళ్లంతా సొంతూరికి ప‌యనం అవుతారు. రైల్వేశాఖ తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌యాణికుల‌ క‌ష్టాలు తీర‌నున్నాయి.

Next Story