- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందేభారత్ స్లీపర్ ఛార్జీలు ఖరారు.. నో RAC, నో వెయిటింగ్ లిస్ట్.. వారికి బడ్జెట్ ఫ్రెండ్లీనే
అదిరిపోయే ఫీచర్లు, కళ్లు చెదిరే లుక్స్, అసలు రైలులో జర్నీ చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా.. అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన వందేభారత్ స్లీపర్ రైళ్లు.. పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: అదిరిపోయే ఫీచర్లు, కళ్లు చెదిరే లుక్స్, అసలు రైలులో జర్నీ చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా.. అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన వందేభారత్ స్లీపర్ రైళ్లు.. పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే కోల్ కతా - గువాహటి మధ్య పరుగులు పెట్టనుంది. తాజాగా రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్ ను నోటిఫై చేసింది. ఈ ట్రైన్లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండదు. కేవలం బెర్త్ కన్ఫర్మ్ అయినవారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. పాక్షికంగా కన్ఫర్మ్ అయినవారిని కూడా ప్రయాణానికి అనుమతించబోమని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ అంటే.. 60 రోజుల ముందు నుంచే రైలులో బెర్తులన్నీ రిజర్వేషన్కు అందుబాటులో ఉంటాయి. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుంది. టికెట్లను డిజిటల్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 24 గంటల్లో రిఫండ్ చేసేందుకు ఈ పద్ధతిని మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. వయసును బట్టి ఆటోమెటిక్ గా లోయర్ బెర్తుల్ని కేటాయిస్తుంది.
రూ.960తో ప్రారంభం
వందేభారత్ స్లీపర్ రైలులో కనీస టికెట్ ఛార్జి రూ.960తో ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి థర్డ్ ఏసీలో ఈ ఛార్జీ వర్తిస్తుంది. థర్డ్ ఏసీ ప్రయాణానికి రైల్వేశాఖ కిలోమీటరుకు రూ.2.4 ఛార్జ్ చేస్తోంది. 2AC కిలోమీటరుకు రూ.3.1 చొప్పున రూ.1240, 1ACలో ప్రయాణానికి కిలోమీటరుకు రూ.3.8 చొప్పున రూ.1520 చెల్లించాల్సి ఉంటుంది. 400 కిలోమీటర్లలోపు ఎంతదూరం ప్రయాణించినా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. అంతకంటే ఎక్కువదూరమైతే దూరాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయి. రూ.2000- రూ.3000 ఖర్చు చేసి స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ ఛార్జీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు. వందేభారత్ స్లీపర్ లో గరిష్ఠంగా 3500 కిలోమీటర్లకు 1AC ప్రయాణానికి టికెట్ ధరను రూ.13,300గా నిర్ణయించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్లు తెలుగురాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తే.. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారి కష్టాలు తీరుతాయి.






