- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో దారుణ ఘటన జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒక మోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న నాగమల్లయ్య (50) అనే వ్యక్తిని తోటి ఉద్యోగి కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోటల్ లో మేనేజర్ గా ఉన్న నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ నెల 10న వారిద్దరి మధ్య ఒక విషయంపై చిన్నపాటి గొడవ జరిగింది. మార్టినెజ్ గదిని శుభ్రం చేస్తుండగా.. విరిగిన వాషింగ్ మెషీన్ వాడొద్దని ఒక మహిళా ఉద్యోగితో చెప్పించాడు. డైరెక్ట్ గా చెప్పకుండా మరో వ్యక్తితో తనకు ఆ విషయం చెప్పించడంతో.. గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో పొడిచాడు. పారిపోయేందుకు మల్లయ్య ప్రయత్నించగా.. తల నరికి చెత్తకుప్పలే పడేశాడు. దాడిని అడ్డుకునేందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మల్లయ్య హత్యతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.






