- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలిఫోర్నియాలో 71 ఏళ్ల వ్యక్తిని పొడిచి చంపిన భారత సంతతి కుర్రాడు!
కాలిఫోర్నియాలో 71 ఏళ్ల వ్యక్తిని పొడిచి చంపాడో భారత సంతతి యువకుడు. పెడోఫైల్స్‌నే తాను టార్గెట్ చేశానని పోలీసులకు చెప్పుకొచ్చాడు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో 71 ఏళ్ల వ్యక్తిని దారుణంగా పొడిచి చంపాడో భారత సంతతి వ్యక్తి. ఈ కేసులో 29 ఏళ్ల వరుణ్ సురేష్‌ను కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేవిడ్ బ్రిమ్మర్ అనే వ్యక్తి గతంలో చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన ‘పెడోఫైల్’ కావడం వల్లనే తాను ఈ దాడి చేసినట్లు వరుణ్ వెల్లడించినట్లు సమాచారం. తాను ఎంతోకాలంగా ఎవరైనా పెడోఫైల్‌ను హత్య చేయాలని అనుకుంటున్నానని, ప్రభుత్వ వెబ్‌సైటులో రిజిస్టర్డ్ సెక్స అఫెండర్ లిస్టులో వీరిని వెతికిపట్టుకున్నానని వరుణ్ తెలిపారు.
ఇలా కొంత మంది పెడోఫైల్స్ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్న వరుణ్.. పబ్లిక్ అకౌంటెంట్‌ను అని చెప్పుకొని బ్రిమ్మర్ ఇంటికెళ్లినట్లు పోలీసులు చెప్పారు. బ్రిమ్మర్ అడ్డుకున్నా.. బలవంతంగా అతని ఇంట్లో దూరి కత్తితో పొడిచినట్లు వివరించారు. ఘటనా స్థలంలోనే వరుణ్‌ను అదుపులోకి తీసుకొని, హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.






