- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Navy: యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాఫ్టర్.. ఇది భారత్ సత్తా
పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం.. అనేలా ఇండియన్ నేవీ తన సత్తా ఏంటో చూపించింది. సముద్రంపై తమకున్న బలాన్ని ప్రదర్శిస్తూ..

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం.. అనేలా ఇండియన్ నేవీ తన సత్తా ఏంటో చూపించింది. సముద్రంపై తమకున్న బలాన్ని ప్రదర్శిస్తూ.. శనివారం Xలో ఒక సంచలన పోస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ ... ఈ మూడు ఆ ఫొటోలో కనిపించాయి. వీటిని ఇండియన్ నేవీ త్రిశూల శక్తిగా (Trident of Naval Power) అభివర్ణిస్తారు. ఆ పోస్ట్‌లో నేవీ.. సముద్రం నుంచి ఆకాశానికి ఎనీ టైమ్, ఎనీ వేర్, ఎలాగైనా అని హ్యాష్ ట్యాగ్ (#AnytimeAnywhereAnyhow) కూడా జత చేసింది. ఆ పోస్టులో స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి అయిన డిస్ట్రాయర్, ఐఎన్ఎస్ కోల్ కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ఉన్నాయి. అయితే ధ్రువ్ హెలికాప్టర్లను ఇప్పుడు వాడకపోవడంతో ఆ ఫొటో పాతదై ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
ఇక స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాములు ఇండియన్ నేవీలో కీలకలంగా మారాయి. శత్రువుల యుద్ధనౌకల్ని, జలాంతర్గాముల్ని కూడా గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన ఈ జలాంతర్గాములు శత్రువుల నిఘా సాధనాలకు దొరకకుండా పనిచేస్తాయి. ఏప్రిల్ 22న బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు ఇది అనుబంధ సంస్థగా ఉంది. గతంలోనే భారత ప్రభుత్వం దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది.






